Gautam Gambhir Slams MS Dhoni's Captaincy Decisions In 2012 | Oneindia Telugu

2018-12-10 1,044

Gautam Gambhir criticised MS Dhoni’s decisions during the 2012 CB series in Australia. The tri-series was part of a forgettable tour of Australia for India. In the 2012 Tri-series in Australia, Dhoni declared that he can't play all three (Gambhir, Sachin and Sehwag) of us together as he was looking ahead at the 2015 World Cup.
#GautamGambhir
#MSDhoni
#DhoniCaptaincy
#IndiavsAustralia
#sachin
#GautamGambhirRetirement

భారత్‌, ఆసీస్‌, శ్రీలంకల మధ్య జరిగిన ముక్కోణపు సీబీ సిరీస్‌-2012లో తుది జట్టు ఎంపిక విషయంలో నాటి టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించాడు గంభీర్‌. కెప్టెన్‌గా అతడి సెలక్షన్‌ విధానాన్ని తప్పుపట్టాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు ఘనంగా గుడ్‌బై చెప్పాడు. అనంతరం మీడియాతో ముచ్చటించాడు. 2012లో ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్‌ సందర్భంగా మా ముగ్గురినీ (గంభీర్‌, సచిన్‌, సెహ్వాగ్‌) తుది జట్టులో ఆడించడం కుదరదని, ఇద్దరికే అవకాశముంటుందని తెలిపాడు. 2015 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అది నాకు పెద్ద షాక్‌. అలాంటి పరిస్థితి ఏ క్రికెటర్‌కైనా షాకే. ఒక ఆటగాడికి మూడేళ్ల తర్వాత జరిగే 2015 ప్రపంచకప్‌లో ఉండవని 2012లోనే ఎవరైనా చెబుతారా?